అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | Ys Jagan Shocked Over Deaths Of Girls In Alluri District | Sakshi
Sakshi News home page

అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Apr 9 2026 6:21 PM | Updated on Apr 9 2026 6:28 PM

Ys Jagan Shocked Over Deaths Of Girls In Alluri District

సాక్షి, తాడేపల్లి: అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మూలగుమ్మి జలపాతంలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు.

‘‘ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్ధులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement