వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Paid Tributes To Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకం: వైఎస్‌ జగన్‌

Dec 25 2024 11:36 AM | Updated on Dec 25 2024 12:09 PM

YS Jagan Paid Tributes To Atal Bihari Vajpayee

సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి. వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకమని ప్రశంసలు కురిపించారు.

వాజ్‌పేయి శత జయంతి సందర్బంగా వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌..‘అటల్ బిహారీ వాజ్‌పేయి బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశం క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మార్గనిర్దేశం చేసిన నాయకుడు. ఆయన 100వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement