
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రామాయపట్నం పోర్ట్ పనులను ప్రారంభించనున్నారు. సీఎం రాక తో తీర ప్రాంతం పోర్ట్ ఏరియా లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియా లో హెలికాప్టర్ లో ల్యాండ్ కానుంది. ముందుగా సముద్రుడికి పూజ చేయనున్న సీఎం జగన్ ఆ తర్వాత పోర్ట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పోర్ట్ నిర్వాసితులు , రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
►వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది.
►పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు.
►రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది.
►తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం
►రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం.
►ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు.
►తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం.
►రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం.
►ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం.
►రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ.
►దాదాపు 85వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.