స్టాలిన్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్‌

YS Jagan Mohan Reddy Congress DMK Leader Stalin For Election Victory - Sakshi

సాక్షి, అమరావతి: తమినాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌(117 స్థానాలు) దాటేసి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈ సారి తమిళనాడులో పదవి చేపట్టబోతుంది. డీఎంకే తరఫున ఆ పార్టీ ప్రతినిధి స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. కలత్తూరులో బరిలో దిగిన స్టాలిన్‌ విజయం దిశగా దూసుకుపోతున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. ఫోన్‌ చేసి ఆయనను అభినందించారు. ఇక తమిళనాడులో డీఎంకే ప్రస్తుతం 137 స్థానాల్లో స్పష్టమైన అధిక్యం కనబరుస్తుంది. కలత్తూరులో బరిలో దిగిన స్టాలిన్‌ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే స్టాలిన్‌ నివాసం వద్ద సందడి నెలకొంది. 

చదవండి: ఎన్నికల్లో విజయం తథ్యం.. కానీ: స్టాలిన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top