పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం

YS Jagan Given Vanijya Utsavam Industry Export Champion Awards entrepreneurs - Sakshi

సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పారిశ్రామికవేత్తలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. రెండేళ్లలో రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు, నమోదు చేసిన వ్యాపార పరిమాణం, ఉద్యోగాల కల్పన ఆధారంగా ఇండస్ట్రీ చాంపియన్లుగా ఎనిమిది మందిని, ఎగుమతుల్లో కీలక భాగస్వామ్యం వహించిన ఏడుగురు ఎగుమతిదారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ఎంపిక చేసింది. విజయవాడలో మంగళవారం జరిగిన వాణిజ్య ఉత్సవ్‌లో వీరిని మెమెంటో, శాలువా, పుష్పగుచ్ఛాలతో ముఖ్యమంత్రి సత్కరించారు.

ఇండస్ట్రీ చాంపియన్‌ అవార్డులు అందుకున్నవారు 
1. పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, సయంట్‌ లిమిటెడ్‌
2. కబ్‌ డంగ్‌ లే, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
3. అనిల్‌ చలమశెట్టి, ఎండీ, గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌
4. అవినాష్‌చంద్‌ రాయ్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, అదాని ఇంటర్నేషనల్‌
5. ఇషాన్‌రెడ్డి ఆళ్ల, ప్రమోటర్‌ డైరెక్టర్, రామ్‌కీ గ్రూపు
6. సి.వి.రాజులు, వైస్‌ ప్రెసిడెంట్, ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
7. కె.మదన్‌మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, అరబిందో ఫార్మా
8. జోష్‌ ఫగ్లర్, ఎండీ, రైజింగ్‌ స్టార్‌ మొబైల్‌ ఇండియా లిమిటెడ్‌

ఎక్స్‌పోర్ట్‌ అవార్డులు అందుకున్నవారు
1. సి.శరవణన్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, బ్రాండిక్స్‌ ఇండియా అప్పరెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
2. లీ మి తేస్, జనరల్‌ మేనేజర్, అపాచీ ఫుట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
3. బి.వి.కృష్ణారావు, ఎండీ, పట్టాభి ఆగ్రో ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
4. వంకా రాజకుమారి, ఎండీ, ఇండియన్‌ హైర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
5. పాండవ ప్రసాద్, జీఎం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
6. సింగలూరి శారదాదేవి, పార్టనర్, ఆర్‌వీ కార్ప్‌
7. కె.శ్రీనివాసరావు, ఎండీ, అమరావతి టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top