
ఫైల్ ఫొటో
సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన.
పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.
Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025
నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance) ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ