
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్‌లకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.

