
సాక్షి, కడప: వైఎస్‌భాస్కర్ రెడ్డి ఆదివారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫీసులో అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెనుదిరిగారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా కేసులో సీబీఐ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా విచారణకు హాజరయ్యాను. విచారణ అధికారి లేరు కాబట్టి తిరిగి మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్లీ విచారణకు హాజరవుతాను. లెటర్ చూస్తే అసలు విషయాలు బయటపడతాయి. కేసును పక్కదారి పట్టించొద్దు. ఈ కేసు పరిష్కారం కావాలంటే లేఖను పరిశీలించాలి అని అన్నారు.