
సాక్షి, విశాఖపట్నం: న్యూడ్ వీడియోలను చిత్రీకరించారనే ఆరోపణతో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాయ్స్ హాస్టల్, ఓ లాడ్జి పక్క పక్కనే ఉండటంతో హాస్టల్‌లో నుంచి లాడ్జి బాత్రూంలో సెల్‌ఫోన్లతో వీడియోలు తీశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు నుంచి తన వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ బాధిత మహిళ తెలిపింది. యువకులకు దేహశుద్ధి చేసిన యువతులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకులు సెల్ ఫోన్లు ద్వారక పోలీసులు పరిశీలిస్తున్నారు.