షుక్రియా.. సీఎం సార్‌ 

Womens thank you rally in Kadapa for CM YS Jagan Welfare Govt - Sakshi

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాపై మహిళల హర్షం

కడప కార్పొరేషన్‌/సాక్షి, విశాఖపట్నం: పేదింటి యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెడుతున్న వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కడపలో మహిళలు ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. ‘షుక్రియా సీఎం సార్‌.. థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ నినాదాలు చేస్తూ.. సీఎం జగన్‌పై తమ అభిమానాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు.

వైఎస్సార్‌ ఆడిటోరియం వద్ద ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా దీనిని ప్రారంభించారు. అలాగే విశాఖలోని లక్ష్మీటాకీసు వద్ద సీఎం  జగన్‌ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి  సంతోషం వ్యక్తం చేశారు. పేదల పెన్నిధి సీఎం క్షేమం కోరుతూ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌ సింహాచలం కొబ్బరికాయలు కొట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top