డాక్టర్‌ చదువుల్లో సమానం! | Women are advancing in higher education across the country | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ చదువుల్లో సమానం!

Published Fri, Mar 31 2023 3:14 AM | Last Updated on Fri, Mar 31 2023 10:06 AM

Women are advancing in higher education across the country - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో మహిళలు దూసుకెళ్తున్నారు. కొన్ని కోర్సుల్లో యువకులను మించి యువతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక 2022 వెల్లడించింది.  దేశంలో 1,59,69,571 మంది యువకులు, 1,50,77,414 మంది యువతులు ఉన్నత విద్య అభ్యసిస్తుండగా ఆర్ట్స్, సైన్స్, మెడికల్, సోషల్‌ సైన్స్‌ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా  ఉంది. కామర్స్, ఐటీ, కంప్యూటర్స్, మేనేజ్‌మెంట్, న్యాయవాద విద్యలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. 

బీఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు (పురుషులు) 109 మంది విద్యార్థినులున్నారు. 
♦ బీఈడీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 182 మంది విద్యార్థినులున్నారు. 
♦ బీఎస్సీ (నర్సింగ్‌లో)లో అత్యధికంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 308 మంది విద్యార్థినులున్నారు. 
♦ ఎంబీబీఎస్‌లో పురుషులతో సమానంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 100 మంది విద్యార్థినులున్నారు. 
♦ ఎంఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థినులున్నారు. 
♦ మ్‌కాంలో ప్రతి వంద మంది విద్యార్థులకు 198 మంది విద్యార్థినులున్నారు. 
♦ ఎమ్మెస్సీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 156 మంది విద్యార్థినులున్నారు.
♦ బీటెక్‌లో ప్రతి వంద మంది విద్యార్థులకు అత్యల్పంగా 40 మంది విద్యార్థినులున్నారు.
♦ ఎల్‌ఎల్‌బీలో కూడా యువతులు తక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది విద్యార్థులకు 49 మంది విద్యార్థినులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement