వారానికి రెండుసార్లు స‌చివాల‌యాల‌ను సంద‌ర్శిస్తా: సీఎం జగన్‌

Will Visit Grama Sachivalayams After Covid Reducing CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా తగ్గుముఖం పట్టగానే వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. రేపటి నుంచి అధికారులు చురుగ్గా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాల‌ని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారనే మాట రావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నామ‌ని, మొత్తంగా వీటిద్వారా 740 సేవలు అందుతాయ‌న్నారు. 

మంగళవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వారానికి రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తానని తెలిపారు. అదే సమయంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 104 కాల్‌ సెంటర్‌.. వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలని, థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ సెకండ్‌ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top