వంట నూనెల అక్రమ నిల్వలపై విస్తృత దాడులు  | Widespread attacks on illegal stocks of cooking oils | Sakshi
Sakshi News home page

వంట నూనెల అక్రమ నిల్వలపై విస్తృత దాడులు 

Apr 1 2022 3:28 AM | Updated on Apr 1 2022 10:33 AM

Widespread attacks on illegal stocks of cooking oils - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై విజిలెన్స్‌ శాఖ దాడులు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 214 దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. పలుచోట్ల లీటర్‌ ప్యాకెట్లలో వంట నూనె 910 గ్రాములే ఉన్నట్టు తేలింది. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న 53 దుకాణాలు, సూపర్‌ మార్కెట్లపై అధికారులు కేసులు నమోదు చేశారు.  మార్చిలో మొత్తం 5,328 దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి 1,690 కేసులు నమోదు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement