AP: స్పెషలిస్ట్‌ వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ | Walk In Interview For Specialist Medical Posts In Ap | Sakshi
Sakshi News home page

AP: స్పెషలిస్ట్‌ వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

Mar 21 2023 8:30 AM | Updated on Mar 21 2023 3:15 PM

Walk In Interview For Specialist Medical Posts In Ap - Sakshi

ఈ క్రమంలో ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. ఇదే క్రమంలో ఏపీవీవీపీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు రెండుసార్లు వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించింది.

సాక్షి, అమరావతి: గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెష­లిస్ట్‌ డాక్టర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించబో­తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ)లో ఖాళీగా ఉన్న(319), ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే(126) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు వాక్‌–ఇన్‌ ఇంటర్వూ్యలు చేపడుతోంది. శాశ్వత, కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. ఇదే క్రమంలో ఏపీవీవీపీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు రెండుసార్లు వాక్‌–ఇన్‌ ఇంటర్వూ్యలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి వాక్‌–ఇన్‌ ఇంటర్వూ్యలు చేప­డుతోంది. విజయవాడలోని పాత జీజీహెచ్‌ ప్రాం­గణంలో ఉన్న డీఎంఈ కార్యాలయంలో ఈ ఇం­టర్వూ్యలు నిర్వహించనుంది.

23వ తేదీన జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫో­రె­న్సిక్‌ మెడిసిన్, డెర్మటాలజీకి సంబంధించి, 25వ తేదీన గైనకాలజీ, ఈఎన్‌టీ, అనస్తీషియా, పాథాలజీకి సంబంధించి, 27న పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంత ఆస్పత్రుల్లో రూ.1.30 లక్షల చొ­ప్పున వైద్యులకు వేతనాలు ఇవ్వనున్నారు. గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లను నియ­మించే ఉద్దేశంతో ప్రభుత్వం అధిక వేతనాలు ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం  www.hmfw.­ap.­gov.­in­ను సందర్శించాలని, 6301138782 ఫోన్‌ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement