నేడు ఉక్కు పోరాట కమిటీ 5కె రన్

Visakha Steel Porata Committee 5K run today - Sakshi

అధికారుల సైలెంట్‌ మార్చ్‌ 

రాత్రి ఉక్కునగరంలో విద్యుత్‌ దీపాలార్పి నిరసన

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం నానాటికి బలపడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలంటూ విశాఖలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి.  ఇప్పటికే కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద ఉక్కు పోరాట కమిటీ సారథ్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. శనివారం జరిగిన దీక్షల్లో ఉక్కు ఎల్‌ఎంఎంఎం, డబ్ల్యూఆర్‌ఎం అర్‌ ఎస్‌ అండ్‌ ఆర్‌ ఎస్‌ విభాగాల కార్మీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపిన హీరో చిరంజీవికి కార్మిక సంఘాలు, పోరాట కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్లే ముందు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే కూర్మన్నపాలెం కూడలి నుంచి గాజువాక వరకు ఆదివారం 7 గంటలకు 5కె రన్‌ చేపట్టనున్నారు. అలాగే  15వ తేదీన పరిపాలన భవనం వద్ద ధర్నా, 20న కేంద్ర కారి్మక సంఘాల సారధ్యంలో ఢిల్లీలో అఖిలపక్షాల నాయకులను కలిసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు మంత్రి రాజశేఖర్‌ తెలిపారు. ఉక్కు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు తెలుగు తల్లి విగ్రహం కూడలి నుంచి కూర్మన్నపాలెం ఆర్చ్‌ వరకు సైలెంట్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు సీ కోర్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. అదే విధంగా ఉక్కునగరం క్వార్టర్లలో రాత్రి 7 గంటల నుంచి 7.15 వరకు విద్యుత్‌ దీపాల్ని ఆపి.. నిరసన తెలపాలని నిర్ణయించారు. అదేవిధంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్‌లో శనివారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రాణాలైనా అరి్పస్తాం.. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామంటూ నినాదాలు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top