
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కలకలం
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది. పలువురి కాళ్లు, చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోవాలని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.