వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూ లేదు

Vijayawada CP Says No Evidence On Vangaveeti Radha Issue - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూలేదని, ఆయన భద్రతపై ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ నగర పోలీసు క మిషనర్‌ టి.కె.రాణా స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాణా మా ట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉంద ని బహిరంగ వేదికపై రాధా చేసిన ప్ర కటనపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశా మన్నారు. రాధా ప్రకటనతో పోలీస్‌ విచారణతో సంబంధం లేకుండా ప్రభుత్వం తక్షణమే గన్‌మెన్‌ను ఏర్పా టు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి పోలీస్‌శాఖతో పాటు, మల్టిపు ల్‌ ఏజెన్సీల ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశామన్నారు.

ఆయన ఇంటి పరిసరాలు, నగరంలోని అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు చెప్పారు. రెక్కీపై నిర్దిష్టమైన ఆధారా లు లేవని తెలిపారు. ఆయన్ని ఇబ్బం దులు పెట్టేలా ఎవరూ ప్రయత్నిం చలేదని, ఆయన ఇంటి వద్ద ఎవరూ రెక్కీ నిర్వహించలేదని వెల్లడైందన్నా రు. అయినప్పటికీ అన్ని కోణాల్లో ఇంకా విచారణ సాగిస్తున్నామని తెలి పారు. దీనిపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కో రారు. ఈ ఘటనపై  మాజీ సీఎం చంద్రబాబునాయుడు పోలీస్‌ శాఖపై చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఎలాంటి నేరపూరిత ఘటన జరగని ఈ ప్రకటనపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేసేందుకు ఆస్కారం లేదని చె ప్పారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దీనికి భంగం కలిగించొద్దని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top