బీసీల మోస చరిత్రకుగానూ టీడీపీకి మళ్లీ ఓటమే!: ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Satires On Kinjarapu Atchannaidu Over Uttarandhra - Sakshi

సాక్షి, అమరావతి: పాలనా రాజధాని విశాఖకు అడ్డుపడుతూ.. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెడుతున్న టీడీపీపై అక్కడి ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్‌ నేతకు ట్విట్టర్‌ ద్వారా చురకలంటించారు. 

ఉత్తరాంధ్రలో టీడీపీ ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం అని వ్యంగ్యం ప్రదర్శించారు విజయసాయిరెడ్డి. ‘టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలు అవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్‌ కాకుండా భ్రమరావతి రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావ్‌. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్‌’ అంటూ విమర్శ గుప్పించారు.

మరో ట్వీట్‌లో.. బీసీలకు దక్కుతున్న ప్రాముఖ్యత ఓర్వలేకున్నాడంటూ చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

బీసీలు జడ్జిలుగా పనికిరారని కొలీజియానికి లేఖ రాశావే చంద్రం! చెప్పులు మోసేవారిని అందలమెక్కించావు తప్ప పేదలను మనుషులుగా చూశావా? జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర జగన్ గారిది. ‘వెన్నుపోటు’ మాత్రమే తెలిసినవాడివి. బ్యాక్ బోన్ కులాల గురించి నీకెందుకు బాబూ? అంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేతకు చురకలు అంటించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top