ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మాజీ ఎంపీ ఉండవల్లి

Undavalli Arun Kumar On Margadarsi Court Case at Rajamahendravaram - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్‌ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరారు. ఈ కేసులో తప్పక ఫలితం తేలుతుంది. మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుంది. కోర్టు ముందు అందరూ సమానమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: (టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తం) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top