వచ్చేనెల్లో షార్‌ నుంచి రెండు ప్రయోగాలు | Two launches from Shar next month | Sakshi
Sakshi News home page

వచ్చేనెల్లో షార్‌ నుంచి రెండు ప్రయోగాలు

Nov 25 2024 5:11 AM | Updated on Nov 25 2024 5:11 AM

Two launches from Shar next month

4న పీఎస్‌ఎల్‌వీ సీ59 

24న పీఎస్‌ఎల్‌వీ సీ60

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశో«ధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్‌లో సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రెండు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలను చేపట్టనున్నది. డిసెంబర్‌ 4న పీఎస్‌ఎల్‌వీ సీ59, 24న పీఎస్‌ఎల్‌వీ సీ60 రెండో రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. 

షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు సంబం«ధించి మొబైల్‌ సరీ్వస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)లో పీఎస్‌ఎల్‌వీ సీ59, పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ బిల్డింగ్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

ముందుగా డిసెంబర్‌ 4న పీఎస్‌ఎల్‌వీ సీ59 రాకెట్‌ ద్వారా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోభా–3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న తరహా ఉపగ్ర­హాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్‌ 24న పీఎస్‌ఎల్‌వీ సీ60 ద్వారా రిశాట్‌–1బి అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వా­ణి­జ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement