నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు

Two Grama Volunteer Won In Municipal Elections As Counselor And Corporator - Sakshi

సత్తెనపల్లి, విశాఖల్లో విజయఢంకా 

సత్తెనపల్లి/కంచరపాలెం (విశాఖ ఉత్తర): నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున వలంటీర్‌ లోకా కల్యాణి బరిలోకి దిగారు.  తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

విశాఖలో.. 
గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్‌ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్‌గా పనిచేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
చదవండి: తాడిపత్రి ఎక్స్‌అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top