Tirumala Srivari Darshanam-Vaccine Certificate: వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే తిరుమలకు..

TTD Visit Only If you have Covid vaccination certificate - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి భక్తులకు తెలిపింది. పలువురు భక్తులు నెగిటివ్‌ సర్టిఫికెట్‌ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల అనేక మంది భక్తులు ఇబ్బందికి గురవుతున్నారు.

ఇటీవల కోవిడ్‌ మూడో వేవ్‌ ఒమిక్రాన్‌ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కచ్చితంగా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. భక్తులు తమ ఆరోగ్యం, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టీటీడీ కోరింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top