శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత | TTD Suspends Sarva Darshan Tokens Starting April 12 As Covid-19 | Sakshi
Sakshi News home page

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Apr 8 2021 2:01 AM | Updated on Apr 8 2021 10:02 AM

TTD Suspends Sarva Darshan Tokens Starting April 12 As Covid-19 - Sakshi

సాక్షి, తిరుమల‌: దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని ఈ నెల 12 నుంచి నిలిపివేస్తున్నట్లు టీటీడీ బుధవారం తెలిపింది. ఆదివారం (11–04–2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం విదితమే.

తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శన టైంస్లాట్‌ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూల్లో వేచి ఉంటున్నారు. దీంతో అక్కడ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement