తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

TTD Invitation to CM YS Jagan Mohan Reddy For SriVari Brahmotsavalu - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు టీటీడీ ఆహ్వానం

సాక్షి, అమరావతి: తిరుమలలో అక్టోబర్‌ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top