100 కిలోల స్వర్ణంతో గోవిందుడి గోపురానికి తాపడం | TTD: Gold Coate To Govindaraya Temple With 100 KG Gold | Sakshi
Sakshi News home page

100 కిలోల స్వర్ణంతో గోవిందుడి గోపురానికి తాపడం

Aug 7 2021 2:12 PM | Updated on Aug 7 2021 2:17 PM

TTD: Gold Coate To Govindaraya Temple With 100 KG Gold - Sakshi

సాక్షి, తిరుమల: సర్వర్‌ సమస్యలు తలెత్తకుండా టీసీఎస్‌తో చర్చలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేస్తామని ప్రకటించింది. హనుమంతుడి జన్మభూమిని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. హనుమంతుడి విగ్రహం, జన్మ వృత్తాంతం తెలిపే చిత్రాలు ఏర్పాటు చేస్తామని, తరిగొండ వెంగమాంబ సమాధి స్థలాన్ని బృందావనంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఇది ఇలా ఉండగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. జూలైలో శ్రీవారిని 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జులైలో హుండీ ఆదాయం రూ.55.58 కోట్లు రాగా, ఈ-హుండీ ఆదాయం రూ.51.97 లక్షలు వచ్చింది. ఇక లడ్డూ విక్రయాలతో రూ.35.26 లక్షల ఆదాయం సమకూరింది. అన్నప్రసాదంలో భోజనం చేసిన భక్తుల సంఖ్య 7.13 లక్షల మంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 2.55 లక్షలు.

Advertisement
 
Advertisement
Advertisement