తిరుపతి: నగరంలో వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుని మహిమాన్విత రూపం దర్శనమిచ్చింది. దేదీపంగా ప్రకాశిస్తూ మహాలింగరూపం సాక్షాత్కరించింది. కట్టెదుట కనిపించిన దివ్యతేజస్సును వీక్షించి భక్తజనం పులకించింది.
అపురూపం
గోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో ఓ అపురూపం దర్శనమిచ్చింది. పవిత్ర తిరునామం స్పురించేలా ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి నుదుటిన వెలుగొందే మూడు నామాల తరహాలో కనిపించిన ఈ అద్భుతానికి ప్రజానీకం ప్రణమిల్లింది.

ఉదయం ఉక్కపోత.. సాయంత్రం వడగళ్ల కుండపోత
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత, మండుటెండ ఇబ్బంది పెట్టింది. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చాలావేగంగా గాలులు వీచాయి. మండలంలోని జాడుపల్లి, బాణాపురం పంచాయతీల పరిధిలోని వడగళ్లతో కూడిన భారీ వాన కురిసింది. – మెళియాపుట్టి



