Tirupati: తిరుమలలో అక్టోబర్‌ 4 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు | Tirumala: Navahnika Salakatla Brahmotsavams from October 4 to 12 | Sakshi
Sakshi News home page

Tirupati: తిరుమలలో అక్టోబర్‌ 4 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Aug 20 2024 8:52 AM | Updated on Aug 20 2024 8:58 AM

Tirumala: Navahnika Salakatla Brahmotsavams from October 4 to 12

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.  బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

04/10/2024  సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024  ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024  ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

07/10/2024 ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

08/10/2024  ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,

10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

12/10/2024 ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. 

ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఆగష్టు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లుం
నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగష్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాం
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగష్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాం
వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఆగష్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
నవంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌ం
తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల

ఆగష్టు 27న తిరుమ‌ల ృ తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

https://ttdevasthanams.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,595 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,981 తలనీలాలు సమర్పించిన భక్తుల . నిన్న హుండీ ఆదాయం రూ.3.89  కోట్లు.  ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement