AP: సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ కారణమని అన్నారు.
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాపు కార్యాలయాన్ని పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాపులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.