‘జగనన్నకు చెబుదాం’పై టీడీపీ నీచ రాజకీయం.. వర్ల రామయ్య పైత్యం

TDP Politics On Jaganannaku Chebudam - Sakshi

గ్రీవెన్స్‌ సెల్‌కు ఫోన్‌ చేసి ఉద్యోగిని వేధించిన టీడీపీ నేత వర్ల రామయ్య

మరో 20 మందితో ఫోన్లు చేయించిన వైనం

సమస్య చెప్పమంటే గ్రీవెన్స్‌ సెల్‌ సిబ్బందితో వెటకారాలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుయుక్తులు 

సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని పరిష్క­రిం­చడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. మీడియా సాక్షి­గా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్‌ సెల్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూ­కుమ్మడిగా ఫోన్లు చేశారు. వెటకారంగా మాట్లా­డుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కా­ర్యాల­యంలో మంగళవారం మీడియా సమా­వేశం నుంచే వర్ల రామయ్య.. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్ర­మాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తనతోపాటు మరో 20 మంది పార్టీ నేతలు, కార్యకర్తలను మీడియా సమా­వేశంలో కూర్చోబెట్టి వారితో 1902 హెల్ప్‌­లైన్‌కి ఒకేసారి ఫోన్లు చేయించారు. తాను కూడా తన ఫోన్‌ నంబరు, ల్యాండ్‌లైన్‌ నంబర్ల నుంచి ఫోన్‌ చేశారు. హెల్ప్‌లైన్‌లో మాట్లాడు­తున్న ఉద్యోగులతో అసభ్యంగా మాట్లా­డు­తూ, వెటకారం చేస్తూ వర్ల రెచ్చి­పోయారు. ‘నీ పేరేంటి.. నీ ఫోన్‌ నంబర్‌ చెప్పు.. నీ దుంప తెగ.. నువ్వు చాలా తెలివైన­వా­డివయ్యా.. నా సమస్యను జగనన్నకు చెప్పే అవకాశం లేదా? అన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించేస్తామ­న్నారుగా..’ అంటూ ఉద్యో­గిని వేధించారు. ‘సీఎం జగన్‌ అవినీతి చేస్తు­న్నారు.. ఫిర్యాదు రాసుకో అంటూ’ ఉద్యో­­గిని చాలాసేపు ఇబ్బంది పెట్టారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్య­క్రమ­మైన ‘జగన­న్నకు చెబుదాం’ను అడ్డుకో­వడం, దానిపై బురద జల్లడమే లక్ష్యంగా వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇష్టం వచ్చినట్లు వ్యవ­హరిం­చడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ తన నీచ రా­జకీయాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉప­యో­­గించుకోవడం అన్యా­యమని మండిపడు­తు­న్నారు. ప్రజల నిజ­మైన ఫిర్యాదుల పరి­ష్కా­­రానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రా­మాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమనే వి­మర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ ల­బ్ధి కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారతారనే దానికి ఇది నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీ­పీ నేతలు అడ్డుకోవడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తు­న్నాయి. ప్రభుత్వ ఉ­ద్యోగు­లను వేధించడానికి, వారి విధులకు ఆ­టంకం కలిగించడానికి చేసిన ప్రయత్నంగానూ ఇది కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top