టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌.. ఎమ్మెల్యే ధీటైన జవాబు | TDP Party Over Action With Vinukonda MLA Bolla Brahma Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ధీటైన జవాబు

May 15 2023 6:39 PM | Updated on May 16 2023 2:39 PM

TDP Party Over Action With Vinukonda MLA Bolla Brahma Naidu - Sakshi

ఎమ్మెల్యే రాకను గమనించి వాహనాన్ని చుట్టుముట్టి మరీ ఓవరాక్షన్‌తో..

సాక్షి పల్నాడు: వినుకొండ మండలం శావల్యాపురంలో తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్‌కు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా శావల్యపురంలో జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేశారు. అయితే.. ఈ క్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ యాత్రకు తారసపడ్డారు. 

అయితే.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వాహనానికి టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని చుట్టుముట్టి పార్టీ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో బయటకు వచ్చారు. ‘రండిరా.. చూసుకుందాం..’ అంటూ యెల్లో బ్యాచ్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.  

ఈలోపు రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు కలుగజేసుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement