ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్‌

Published Wed, May 22 2024 1:40 PM

TDP Leaders Remanded In EVM Vandalism Case At Palnadu

సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.

కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్‌, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్‌ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్‌ భయంతో పరారయ్యారు. 

ఈవీఎం లు ధ్వంసం చేసిన టీడీపీ నేతలకు రిమాండ్
 

 

Advertisement
 
Advertisement
 
Advertisement