సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతలు అరాచకాలు కొనసాగుతున్నాయి. రేణిగుంట గురవరాజు పల్లిలో పేదల ఇళ్లపై టిడిపి నేతలు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. టిడిపి నాయకులు ఖాదర్ భాష, మునికృష్ణ ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు తెల్లవారుజామున ఇళ్లను కూల్చేశారు.
దాంతో కట్టు బట్టలతో మయి మూన్, సైయిదా కుటుంబం రోడ్డున పడింది. నివాసం కోల్పోయిన ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అవుతోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చింది టిడిపి నాయకులే అంటూ ఆవేదన చెందారు.


