
సాక్షి, కర్నూల్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. గురువారం కర్నూలులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే సభ నుంచి టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. కార్యకర్తలకు స్థానిక నాయకులు సర్దిచెప్పినా వారు పట్టించుకోకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో టీడీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది.
ఇది కూడా చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని