
సాక్షి, పల్నాడు: టీడీపీ బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో టీడీపీ నిర్వహించిన సభలో భోజనాల సమయంలో తోపులాట జరిగింది. కాగా, ఈ తోపులాటలో వేడి సాంబార్ డేక్షలో పడిపోయి టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా