English Medium in AP Schools: ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లపై సుప్రీంకోర్టు విచారణ | Supreme Court Notice on Govt's Plea to Make English as Medium - Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లపై సుప్రీంకోర్టు విచారణ

Sep 3 2020 12:17 PM | Updated on Sep 4 2020 8:01 AM

Supreme Court Trial On AP English Medium Schools Petition - Sakshi

న్యూఢిల్లీ : ఏపీలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జీ.ఓ 84పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం  కోరుకోవటం సర్వేలో వెల్లడైందని, ఇంగ్లీష్ మీడియంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ( తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్‌ మీడియానికే )

త్వరలో పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్టేను తొలగించాలని విన్నవించారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం వాదనలను ఆలకించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement