విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు | Summer Special Trains Via Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 18 2026 8:37 AM | Updated on Apr 18 2026 9:03 AM

Summer Special Trains Via Vijayawada

సాక్షి, విజయవాడ: వేసవిలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ ఒక ప్రటకలో తెలిపారు. ఎస్‌ఎంవీటీ బెంగళూరు–బాలుర్‌ఘాట్‌ (06551) ఈ నెల 17, 24 తేదీలలో శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఎస్‌ఎంటీవీ బెంగళూరులో బయలుదేరి, ఆదివారం ఉదయం 6 గంటలకు బాలుర్‌ఘాట్‌ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06552) ఈ నెల 20, 27 తేదీలలో మంగళవారం ఉదయం 5.10 గంటలకు బాలుర్‌ఘాట్‌లో బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు కృష్ణార్జునపురం, బంగారుపేట్, కుప్పం, జోలార్‌పెట్టాయ్, కాట్‌పాడి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, పలాస, బ్రహ్మపురం తదితర స్టేషన్‌లలో ఆగుతుంది. 

చర్లపల్లి–సంత్రగచ్చి (07677) ప్రత్యేక రైలు ఈ నెల 21న మంగళవారం ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–హైదరాబాద్‌ (07678) ప్రత్యేక రైలు ఈ నెల 22న బుధవారం సాయంత్రం 4.45 గంటలకు సంత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

రెండు మార్గాలలో ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్ధారోడ్డు, భువనేశ్వర్, కటాక్‌ తదితర స్టేషన్‌లలో ఆగుతుంది. 
కాకినాడ టౌన్‌–హిసార్‌ (07717) ప్రత్యేక రైలు ఈ నెల 21న మంగళవారం ఉదయం 5.40 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు హిసార్‌ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మెడ్‌చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మబాద్‌ తదితర స్టేషన్‌లలో ఆగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement