ఆహార శుద్ధి విధానంపై రాష్ట్రస్థాయి సదస్సు ప్రారంభం

State Level Conference On Food Processing Policy At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఆహార శుద్ధి విధానం 2020-25 రాష్ట్రస్థాయి సదస్సును వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఆహార శుద్ధి విధానల తీరుతెన్నులు, ఆహార శుద్ధి  విధాన అమలు తదితర అంశాలపై విజయవాడ ఏపీఐఐసీ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ లక్ష్యాలు, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన, పరిశ్రమ నైపుణ్య అభివృద్ధి తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రైతులను ఆర్థికంగా బలపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ అభివృద్ధి, రైతుల ఉత్పత్తులకు రెట్టింపు ఆదాయం లక్ష్యంగా చేసుకుని ఈ విధానం అమలు చేస్తామని వెల్లడించారు. పంట ఉత్పత్తులకి అదనపు విలువ చేకూర్చడం, వాటి మార్కెటింగ్, వ్యవసాయ, హార్టికల్చర్, డైరీ ఉత్పత్తుల్లో రైతుల అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి' అని మంత్రి కన్నబాబు తెలిపారు. (చంద్రబాబుదో అబద్ధాల ఫ్యాక్టరీ)

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక అగ్రోప్రాసెసింగ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు, పుడ్‌ప్రాసెసింగ్‌ సీఈఓ శ్రీధర్‌ రెడ్డి, ఇతర హార్టికల్చర్‌ అధికారులు పాల్గొన్నారు.  (‘బాబుకు ఆ మాత్రం తెలియదా..?’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top