‘బాబుకు ఆ మాత్రం తెలియదా..?’ | Minister Kurasala Kannababu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే టీడీపీ దుష్ఫ్రచారాలు..

Sep 29 2020 5:31 PM | Updated on Sep 29 2020 5:56 PM

Minister Kurasala Kannababu Fires On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబు దుష్ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు గతంలో కులాన్ని, ఇప్పుడు మతాన్ని ఎంచుకుని రాజకీయాలు చేస్తున్నారు. చిత్తూరులో జరిగిన దాడిని మంత్రి పెద్దిరెడ్డికి ఆపాదించాలని చూశారు. దాడి చేసింది టీడీపీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డి.. బాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. తన హయాంలో దేవాలయాలను కూల్చేసింది చంద్రబాబే. ఆలయాలపై దాడుల ఘటనల్లో టీడీపీ వాళ్లే ఉన్నారు. తుని ఘటనలో సైతం చంద్రబాబే నిప్పు పెట్టించి హడావుడి చేశారని’’ కన్నబాబు దుయ్యబట్టారు. (చదవండి: బురద జల్లేందుకే ఆ పిచ్చి రాతలు’)

2,700 కోట్లతో ఉచిత బోర్లు వేయాలని పథకం ప్రారంభించాం. టీడీపీ పథకాలకు పేర్లు మార్చి వాడుతున్నామని.. యనమల రామకృష్ణుడు అంటున్నారు. టీడీపీ హయాంలో ఒక్క బోర్ అయినా వేశారా?  అని కన్నబాబు ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు. వరదల వల్ల ప్రకాశం బ్యారేజీ సహా అనేక జలాశయాలు నిండాయని, బాబు అక్రమ నివాసం ముంచేయడానికి మేమే వరదలు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. నీరు వదలకుండా ఉంచడం కుదరదని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. వరదపై అప్రమత్తం చేయడానికి నోటీసులు ఇవ్వడం సహజమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. (చదవండి: ‘అందుకే చం‍ద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే కోపం’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement