తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపు.. ఇవి గమనించండి!

Srinivasa Sethu Flyover Construction: Traffic Diversion in Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి:  నగరంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ వైపునకు వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాలను తాత్కాలికంగా మళ్లిస్తున్నామన్నారు. ఈ మార్పు శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. 

బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు 
రామానుజపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద నుంచి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండుకు చేరుకోవచ్చు. 
చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు .


మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు  

చెర్లోపల్లి సర్కిల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ చేరుకుంటాయి.
చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు. 
 

లైట్‌ మోటార్‌ వాహనాలు: 

బస్టాండ్‌ నుంచి రేణిగుంటకు.. రామానుజం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్‌ వైపు వెళ్లాలంటే డీబీఆర్‌ హాస్పిటల్‌ మీదుగా హీరో హోండా షోరూమ్‌ వద్ద రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ దాటుకొని వెళ్లవచ్చు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ ఉన్నట్లు గుర్తించగలరు. 


పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు: 

రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్‌ ఫ్లై ఓవర్, ఆర్‌సీపురం జంక్షన్, ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య సర్కిల్, వెస్ట్‌ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ చేరుకుంటాయి. 

హైదరాబాద్, కర్నూల్, కడప వాహనాలు కరకంబాడి మీదుగా బస్టాండు చేసుకోవచ్చు. 


నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు రేణిగుంట రమణవిలాస్‌ సర్కిల్‌ మీదుగా కరకంబాడి, మంగళం లీలామహల్‌ మీదుగా వెళ్లచ్చు.  లేకుంటే, గాజులమండ్యం జంక్షన్, ఆర్సీ పురం జంక్షన్, రామానుజపల్లి చెక్‌ పోస్ట్, మహిళా యునివర్సిటీ, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండ్‌ చేరుకోవచ్చు.  

అత్యవసర వాహనాలు 
ట్రాఫిక్‌ మళ్లింపు కారణంగా అంబులెన్స్, మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ సహకరించాలి. అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గాన్ని ఎంచుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. (క్లిక్‌: హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top