టీడీపీ నేతల గ‘లీజు’ దందా | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల గ‘లీజు’ దందా

Published Wed, Oct 11 2023 5:22 AM

Space on lease at a nominal fee under TDP - Sakshi

 చిత్తూరు అర్బన్‌: మునిసిపల్‌ స్థలాన్ని కొట్టేసేందుకు బినామీ పేరుతో టీడీపీ నేతలు సాగించిన గలీజు దందాకు అడ్డుకట్ట పడింది. మంగళవారం చిత్తూరులోని ఎంఎస్‌ఆర్‌ మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్‌ కమిషనర్‌ అరుణ, అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 2016లో చిత్తూరుకు చెందిన టీడీపీ కార్పొరేటర్, ఓ క్రియాశీలక నేత.. జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న మునిసిపల్‌ ఖాళీ స్థలంపై కన్నేశారు.

ఇందులో భాగంగా కమలహాసన్‌ అనే వ్యక్తి పేరుతో అప్పటి మేయర్‌కు లేఖ రాశారు. తనకు ఎలాంటి ఆసరా లేదని, మునిసిపల్‌ స్థలం లీజుకు ఇస్తే బతుకుదెరువు చూసుకుంటానని అందులో పేర్కొన్నారు. ఆ వెంటనే మునిసిపల్‌ కౌన్సిల్‌ రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఏటా రూ.15 వేలు చెల్లించేలా మూడేళ్ల పాటు లీజుకిచ్చింది. ఆ వెంటనే టీడీపీ నేతలు చిత్తూరులోని ఎంఎస్‌ఆర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పరిధిలో.. ఏడు దుకాణాలు నిర్మించారు. వాటిని ఏటా రూ.70 వేల వరకు అద్దెలకు ఇచ్చారు.

అడ్వాన్సుల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. మూడేళ్ల లీజు పూర్తయినా స్థలాన్ని మునిసిపాలిటీకు అప్పగించకుండా రూ.లక్షలు దండుకున్నారు. ఇదే సమయంలో లీజు పొడిగించాలంటూ హైకోర్టుకు వెళ్లగా.. కొన్నాళ్ల పాటు స్టే ఇచ్చింది. తాజాగా న్యాయస్థానం స్టేను డిస్మిస్‌ చేయడంతో రూ.కోట్ల విలువైన స్థలాన్ని, వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్‌ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement