అమ్మో.. గిరి నాగు 

Snake Catcher Catches Giri Nagu Snake In Visakha District - Sakshi

మాడుగుల రూరల్‌: మాడుగుల నూకాలమ్మ కాలనీలో 12 అడుగుల కింగ్‌ కోబ్రా గిరి నాగు ఆదివారం సాయంత్రం హల్‌చల్‌ చేసింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలు నూకాలమ్మ జాతరలో వుండగా.. గండి నాని ఇంటి గోడను ఆనుకొని గిరి నాగును గమనించిన జనం భయంతో పరుగులు తీశారు. ఈస్టర్‌ గార్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ (తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ) వారికి స్థానికులు ఫోన్‌ చెయ్యగా.. చోడవరం ఫారెస్టు రేంజర్‌ రామ్‌ నరేష్‌ బిర్లాంగి నేతృత్వంలో మాడుగులకు చెందిన స్నేక్‌ కేచర్‌ పి.వెంకటేశ్‌ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారు గరికబంద అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

గిరి నాగులు హాని చెయ్యవని, ఎక్కడ విషపూరిత సర్పజాతులు వుంటాయో వాటిని తినడానికి వస్తాయని అటవీ అధికార్లు పేర్కొన్నారు. ఈ పాము ఆకారం చూసి భయపడిన వారు కర్రలతో దాడి చేసి చంపడానికి సిద్ధపడుతున్నారు. చుట్టుపక్కల ఇటువంటి సర్పజాతులు కనబడితే వెంటనే అటవీ అధికార్లకు తెలియజేయ్యాలని అటవీ అధికారులు ప్రజలను కోరారు.

చదవండి:
పాజిటివ్‌ వచ్చింది బాబూ.. పకోడీలు వేసి వస్తా!  
అయ్యో బిడ్డా: దూసుకొచ్చిన మృత్యువు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top