కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..

Smart City Kakinada Has Earned Another Rare Recognition - Sakshi

కాకినాడ(తూర్పుగోదావరి): స్మార్ట్‌సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మంచి వాతావరణాన్ని కల్పించడం, పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచడం, సామాజిక అంశాలపై యువతలో చైతన్యం పెంపొందించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి కాకినాడ స్మార్ట్‌సిటీకి మంగళవారం సమాచారం అందింది.

చదవండి: మసాజ్‌ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు

ఈ ప్రక్రియకు దేశంలోని పలు నగరాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క కాకినాడకు మాత్రమే చోటు లభించింది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల తినుబండారాలను హైజనిక్‌గా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అజాదికా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో విద్యార్థుల మధ్యపోటీ పెట్టడం, సైకత శిల్పాల తయారీ, డ్రాయింగ్‌ పోటీలు సహా అనేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రత్యేక గుర్తింపును సాధించగలిగింది. ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించి అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేలా చేసిన కృషికి ఈ గౌరవాన్ని దక్కించుకోగలిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంమరోసారి కాకినాడ స్మార్ట్‌సిటీని మంచిస్థానంలో నిలబెట్టిందని కమిషనర్‌ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్‌ చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top