‘పోప్ లియో వెనెరబల్’గా గౌరవం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందించిన సిస్టర్ డాక్టర్ మేరీ గ్లోరీ(Dr Mary Glowrey)కి అరుదైన గౌరవం లభించింది. సిస్టర్ గ్లోరీ చేసిన అసాధారణమైన సేవలను గుర్తించి ‘పోప్ లియో వెనెరబల్’గా ప్రకటిస్తూ రోమ్‌లో ఆమోదించినట్లు గుంటూరు ప్రావి¯న్స్ ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ ఉడుమల విజయ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1920లో భారత్‌కు వచ్చిన మేరీ గ్లోరీ గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా సేవలందించారని ఆమె గుర్తుచేశారు.
రోమన్ క్యాథలిక్ పరిభాషలో మరణించిన తరువాత ఎవరు పేరు మీద అయితే ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరుగుతాయో వారికి ఈ అరుదైన గౌరవం దక్కుతుందని చెప్పారు. మేరీ గ్లోరీని వెనెరల్‌గా ప్రకటించడం ద్వారా సెయింట్ హుడ్ వైపు ఒక ముఖ్యమైన అడుగు పడిందని ఆమె పేర్కొన్నారు. గుంటూరు నగరం సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో సిస్టర్ మేరీ గ్లోరీ సమాధి, ఆమె జీవితాన్ని ప్రదర్శించే మ్యూజియం ఉండటం ఎంతో అదృష్టమని.. గుంటూరు ప్రజలు మేరీ గ్లోరీ చేసిన సేవలను, సేవా జీవితాన్ని తెలుసుకునేందుకు మ్యూజియాన్ని సందర్శించాలని సిస్టర్ విజయ కోరారు.


