
విశాఖపట్నం మధురవాడలో ఘటన
మధురవాడ(భీమిలి): కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి నిండు చూలాలైన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖపట్నం మధురవాడ ఆర్టీసీ డిపో సమీపంలో చోటు చేసుకుంది. విశాఖ నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు, మృతురాలి బంధువుల వివరాల ప్రకారం... కూర్మన్నపాలెం సెక్టార్–2, దువ్వాడకు చెందిన గెద్డాడ జ్ఞానేశ్వర్(28), అనకాపల్లి జిల్లా నర్సీపటా్ననికి చెందిన కేదారిశెట్టి అనూష (27)తో 2023లో వివాహమైంది. జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఏడాది క్రితం వీరిద్దరూ మిథిలాపురి వుడాకాలనీకి వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా... అప్పుడప్పులు గొడవలు పడుతుండేవారు. ఏడాది కాలంగా జ్ఞానేశ్వర్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
నూషకు తొమ్మిది నెలలు నిండగా సోమవారం కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో చేరాల్సి ఉంది. ఇందుకోసం ఆమె అమ్మమ్మ అన్నవరం వచి్చంది. ఈక్రమంలో సోమవారం ఉదయం జ్ఞానేశ్వర్ భార్య అనూషను హత్యచేసి ఏమీ తెలియనట్టు బెడ్‌రూంలో కూర్చున్నాడు. అనూషను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం అవుతుండటంతో అమ్మమ్మ అన్నవరం ఆమెను పిలిచింది. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తట్టి లేపింది. అయినా కదలకపోవడంతో జ్ఞానేశ్వర్‌కు చెప్పింది.
ఏమీ తెలియనట్టు వెంటనే జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో అనూషను ఆరిలోవ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న సీఐ బాలకృష్ణ విచారణ చేపట్టారు. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో తనను అనూష అనుమానించి మానసికంగా హింసించిందని, విసుగు చెంది గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితుడు జ్ఞానేశ్వర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.