మున్సిపల్‌ పోలింగ్‌ 60.36 శాతం | SEC announces polling details for local elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ పోలింగ్‌ 60.36 శాతం

Nov 2 2026 4:38 AM | Updated on Nov 2 2026 4:37 AM

SEC announces polling details for local elections

ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన పోలింగ్‌ 

రాత్రి 10.50 గంటలకు వివరాలు ప్రకటించిన ఎస్‌ఈసీ 

తుది పోలింగ్‌ శాతం సోమవారం ప్రకటిస్తామని వెల్లడి 

కనిగిరిలో అత్యధికంగా 83.86 శాతం పోలింగ్‌ 

అత్యల్పంగా తిరుపతిలో 46.85 శాతం పోలింగ్‌ 

2021లో పోలింగ్‌ 63.6 శాతం నమోదు 

సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన పోలింగ్‌లో 60.36 శాతం నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మొత్తం 96,89,061 మంది ఓటర్లలో 58,48,040 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు పేర్కొంది. గ్రేటర్‌ విశాఖలో 50.02 శాతం, విజయవాడలో 52.10 శాతం, తిరుపతిలో 46.85 శాతం నమోదైనట్టు ప్రకటించింది. 

మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా కనిగిరిలో 83.86 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్ప ఓటింగ్‌ శాతం తిరుపతిలో నమోదు కావడం గమనార్హం. కాగా సోమవారం తుది పోలింగ్‌ శాతం వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 2021లో జరిగిన పురపోరులో 63.6 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపింది.

ఓటేసిన గవర్నర్‌ దంపతులు
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్‌ సప్తగిరి జూనియర్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement