
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని కోర్టుల ద్వారా అడ్డుకోవడం న్యాయమేనా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.