breaking news
historical decision
-
పెళ్లి చేసుకోవచ్చు.. కానీ రిసెప్షన్ చేసుకోకూడదు!
వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, బంధుమిత్రుల సంబరం. అయితే ఇటీవల రోజుల్లో పెళ్లి, ఆ తర్వాత ఘనంగా నిర్వహించే విందు(రిసెప్షన్) కేవలం సంప్రదాయంగా మిగలకుండా ప్రతిష్టకు నిలయంగా మారింది. వాళ్లు పది గొర్రెలు కోశారు, మనం ఏమీ తక్కువ చేయకూడదు అనే అహంభావం పేద, మధ్య తరగతి వర్గాలను అప్పుల ఊబిలోకి నెడుతోంది. ఈ ఆడంబరాలు, దుబారా ఖర్చులకు కళ్లెం వేసేందుకు శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకా హరగి గ్రామస్తులు గట్టి ముందడుగు వేశారు. కరువుతో రైతులు, పేద కుటుంబాలు అల్లాడుతున్న నేపథ్యంలో గ్రామంలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తుల ఏకాభిప్రాయ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తే అలాంటి వారికి రూ.1 లక్ష జరిమానా, ఎవరైనా ఆ రిసెప్షన్లో భోజనం చేస్తే వారికి రూ.50 వేల భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. చర్చనీయంగా గ్రామస్తుల నిర్ణయం ఆర్థిక క్రమశిక్షణను కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ చర్చకు దారి తీసింది. సుమారు 350 కుటుంబాలు ఉన్న హరగి గ్రామంలో చాలా వరకు ఈడిగ సముదాయం వాసులే ఎక్కువగా నివసిస్తున్నారు. గతంలో 10 నుంచి 15 మందికి పరిమితమైన పెళ్లి వేడుక ఇప్పుడు షామియానాలు, టేబుళ్లు, కిరాణ సరుకులు, పెళ్లి కొడుకు వారి ఖర్చులతో సహా కనీసం రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన భారీ ట్రెండ్‌గా మారింది.పేదలు కనీసం రూ.2 లక్షలను అప్పు చేసి ఈ భోజనాలు పెట్టించాల్సిన అనివార్యత నెలకొంది. ప్రత్యేకంగా పెళ్లికుమార్తె కుటుంబానికి భారీ ఆర్థిక భారంగా మారింది. రిసెప్షన్ మలెనాడు ప్రాంతంలో సంప్రదాయం కాదు. పాత మైసూరు ప్రాంతంలోని మండ్య, హాసన, చామరాజనగర, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాల పద్ధతి. అది ఈ వైపునకు కూడా విస్తరించింది. మొత్తం మీద ప్రెస్టేజీ ప్రదర్శన కన్నా మానవత్వం, ఆర్థిక భద్రత ముఖ్యం అనే మహత్తర సందేశాన్ని హరగి గ్రామం చాటింది. గ్రామస్తుల నిర్ణయం స్వాగతార్హం ఈ విషయంపై గ్రామాభివృద్ధి కార్యదర్శి గురుమూర్తి హరగి మాట్లాడుతూ ఇటీవల రోజుల్లో రిసెప్షన్ నిర్వహించే పద్ధతి అధికమైంది. దీంతో వెనుక బడిన, పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థికభారం అధికమైంది. ఈనేపథ్యంలో గ్రామస్తులంతా ఐకమత్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎస్డీఎంసీ ఉపాధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడుతూ శికారిపుర తాలూకా హరగి గ్రామస్తుల నిర్ణయం స్వాగతార్హం. ఇలాంటి సంప్రదాయానికి కళ్లెం వేయడం వల్ల కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు. ఇతర గ్రామాల వారు స్వచ్ఛందంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. -కర్ణాటక -
నిర్ణయాలను అడ్డుకోవడం న్యాయమేనా: సజ్జల
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని కోర్టుల ద్వారా అడ్డుకోవడం న్యాయమేనా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. -
దాడి చేయనని హామీ ఇస్తే అణ్వస్త్రాలను త్యజిస్తాం
సియోల్/వాషింగ్టన్: కొరియా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు అధికార ప్రకటన చేయటంతో పాటు తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా తెలిపింది. ఇటీవల జరిగిన అగ్రనేతల చారిత్రక సమావేశం సందర్భంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రతిపాదన చేశారని దక్షిణకొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి యూన్ యంగ్–చాన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే మేలో అణు పరీక్షల ప్రాంతాన్ని మూసి వేయటంతోపాటు ఈ కార్యక్రమానికి అమెరికా, దక్షిణ కొరియా నిపుణులు, మీడియాను ఆహ్వానిస్తామని కిమ్ తెలిపారన్నారు. తాము అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకమని, ఈ విషయంలో పారదర్శకతతో ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పేందుకే కిమ్ ఈ ప్రతిపాదన చేశారని చాన్ చెప్పారు. ‘మేం అమెరికాతో తరచుగా చర్చలు జరిపితే, రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. అప్పుడు యుద్ధ వాతావరణం సమసిపోతుంది. అలాంటప్పుడు మాకు అణ్వాయుధాలతో పనే ముంటుంది?’ అని కిమ్ తెలిపారన్నారు. -
వారసత్వ ఉద్యోగాలపై చరిత్రాత్మక నిర్ణయం
ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ రెబ్బెన : 18 ఏళ్లుగా సింగరేణి కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌ది చరిత్రాత్మక నిర్ణయమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్‌క్లబ్‌లో టీబీజీకేరియా ఏరియా సర్వసభ్య స మావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ సింగరేణిలో వీఆర్ఎస్ ఉద్యోగాలను రద్దు చేస్తూ జాతీ య సంఘాలు ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నా రు. కేవలం కార్మికులు మరణిస్తే, మెడికల్ అన్‌ఫిట్ అ యితే తప్ప కార్మికులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితులు లేకుండా పోయాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ రిటైర్ అయ్యే వరకు అందుతుందని తెలిపారు. జాతీయ సంఘాలు పొగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరణకు అంగీకారం తెలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని సీఎండీని ఆదేశించారని తెలిపారు. కమ్యూనిస్టు యూనియన్లను భూస్థాపితం చేయాలి : ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే కమ్యూనిస్టు యూ నియన్లను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ సంఘాలు కార్మికులను ఓట్ల వేసే యంత్రాలుగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచిన అనంతరం యాజమాన్యానికి తొత్తులుగా మారుతున్నాయని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను కాలరాసిన కమ్యూనిస్టు సంఘాలు ఏ ముఖం పెట్టుకుని కార్మికులను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను కార్మికులు గెలిపిస్తే ప్రభుత్వ అండతో మరిన్ని హక్కులను సాధిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏరియాకు చెందిన కార్మికులు భారీస్థాయిలో టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ సమావేశంలో రెబ్బెన, తాండూర్ జెడ్పీటీసీలు అజ్మీర బాబురావు, సురేష్‌బాబు, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్ పర్సన్ శంకరమ్మ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, కేంద్రకమిటీ కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఏరియా కార్యదర్శులు శంకరయ్య, శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.


