
సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల మృతి చెందిన జర్నలిస్టులపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) నుంచి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఈ పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దీనిపై నిర్ణయం తీసుకోగా.. బుధవారం ఉత్తర్వులిచ్చింది. కాగా, జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.