Rotten Meat with Insects Found In Vijayawada - Sakshi
Sakshi News home page

Vijayawada: 100 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం.. ఆర్డర్లను బట్టి రెస్టారెంట్లకు

Jul 5 2022 8:54 AM | Updated on Jul 5 2022 2:43 PM

Rotten Meat with Insects Found In Vijayawada - Sakshi

కుళ్లిన మాంసాన్ని చూపుతున్న  రవిచంద్‌ 

చనిపోయిన మేకలు, గొర్రెలు తక్కువ ధరకు కొనుగోలు చేసి జంతువుల పొట్టలో పేగులు తొలగించి వాటిస్థానంలో ఐస్‌ ముక్కలు ఉంచి నగరానికి తరలిస్తారని తెలిపారు.

సాక్షి, పటమట (విజయవాడ తూర్పు): అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంక తారకరామ నగర్‌కు చెందిన హరిమాణిక్యం రాము తన ఇంట్లో అక్రమంగా మాంసం నిల్వ ఉంచారని అధికారులకు ఫిర్యాదు అందింది. వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ రవిచంద్‌ సోమవారం తనిఖీ చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రవిచంద్‌ మాట్లాడుతూ హరిమాణిక్యం రాము చనిపోయిన మేకలు, గొర్రెలు తక్కువ ధరకు కొనుగోలు చేసి జంతువుల పొట్టలో పేగులు తొలగించి వాటిస్థానంలో ఐస్‌ ముక్కలు ఉంచి నగరానికి తరలిస్తారని తెలిపారు. ఆర్డర్లను బట్టి తెచ్చిన ఈ మాంసాన్ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారన్నారు. తారకరామానగర్‌లోని ఆయన ఇంటిలో నిల్వ ఉంచారని విషయం తెలుసుకుని దాడి చేయగా రాము వద్ద 100 కిలోలకు పైగా చనిపోయిన మేకలు, గొర్రెలు, వాటి తల, మాసం, కాళ్లు పురుగులు పట్టి ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement