అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి | Road Accident AT Annamayya District | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Jun 30 2025 7:19 AM | Updated on Jun 30 2025 3:26 PM

Road Accident AT Annamayya District

సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడటంతో వారిని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 


 

Advertisement
 
Advertisement
Advertisement